తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

సింగరాయకొండ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బి.సి ఎంప్లాయిస్ అసోసియేషన్ మరియు పూలె విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్స్ చైర్మన్ వేల్పుల సింగయ్య, వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మించల బ్రహ్మయ్య,బిసి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఆవుల కోటేశ్వరరావు, సింగరాయకొండ సబ్ ఇన్స్పెక్టర్ బి మహేంద్ర, ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు,అంబటి బ్రహ్మయ్య,ప్రసాదు,న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు, అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు,స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు, విద్యావేత్తలు హాజరై పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జీవితం, ఆలోచనలు, సమాజానికి చేసిన సేవలను విశదీకరించారు.
వక్తలు పేర్కొంటూ, పూలే గారు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన మహానుభావుడని, విద్యను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ఆయన చేసిన కృషి అపారమని కొనియాడారు. ముఖ్యంగా మహిళల విద్యా అభివృద్ధికి ఆయన చేసిన సేవలు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు.
ఈ సందర్భంగా బీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ, పూలే గారి ఆశయాలు నేటికీ సమాజానికి మార్గదర్శకాలని, ఆయన చూపిన సమానత్వ మార్గంలో నడవడం ద్వారా మాత్రమే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అన్నారు. పూలే విగ్రహ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ జయంతిని మరింత విస్తృతంగా నిర్వహించి యువతలో అవగాహన పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు పూలే గారి ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు కట్టుబడి పనిచేస్తామని, సమాజంలో అసమానతలను నిర్మూలించి సమానత్వం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *