తొలి శుభోదయం న్యూస్ కొండేపి :-

కొండేపి మండలం మూగచింతల గ్రామంలో దళితులకు స్మశానానికి వెళ్లేందుకు సరైన దారి లేక అనేక సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యను సామాజిక చైతన్య బైక్ యాత్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో దళితవాడ ప్రజలను కలుపుకొని యాత్ర బృందం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈనిరసన కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కేజీ మస్తాన్ వహించారు.
ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి బి. రఘురామ్ మాట్లాడుతూ, ప్రభుత్వాలు జారీ చేసిన జీవో నం.1235 ప్రకారం స్మశాన స్థలాలు ఏర్పాటు చేయడం, దారిలేని స్మశానాలకు మార్గాలు కల్పించడం, అక్రమ ఆక్రమణలు తొలగించడం వంటి చర్యలు తీసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, వాటి అమలు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యబడుతోందని విమర్శించారు. ప్రకాశం జిల్లాలో దళితుల స్మశాన సమస్యలు ఇప్పటికీ తీవ్రంగా కొనసాగుతున్నాయని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు.
దళితుల ప్రాథమిక హక్కు స్మశానానికి వెళ్లే దారి సమస్యను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని యాత్ర బృందం డిమాండ్ చేసింది. మూగచింతల గ్రామంలో స్మశానానికి సరైన రహదారి ఏర్పాటు చేసి, దళితుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాలు ఆంజనేయులు, మాట్లాడుతూ దళితులు పరిస్థితి నేటికీ అత్యంత దుర్మార్గంగా ధైర్యంగా ఉందని పాలకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చటంలోనూ దళితుల యొక్క స్థితిగతులు మార్పు చేయటంలోనూ ఏమాత్రం చొరవ చూపటం లేదని అందులో భాగమే నేటికీ మూగచింతల గ్రామంలో స్మశాన స్థలానికి దారి లేకపోవడం కారణమని ప్రభుత్వాలు తక్షణం దళిత సమస్యలపై పరిష్కారం వైపు ప్రయత్నాలు చేయాలని లేని పక్షంలో ఉద్యమాల ద్వారా మాత్రమే వాటిని సాధించుకోగలమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నేరుసుల వెంకటేశ్వర్లు, జి.ఎం.పి.ఎస్ జిల్లా కార్యదర్శి టి. తిరుపతిరావు, కెవిపిఎస్ నాయకులు రామారావు, ఎం.రావు, కొండ వెంకటేశ్వర్లు, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి వినోద్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *