తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
లింగసముద్రం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు విశేష సేవలు అందించిన శ్రీ గుంటుపల్లి శ్రీనివాసులు గారి పదవీ విరమణ మహోత్సవంలో నేడు పాల్గొన్నాను. కందుకూరు పట్టణంలోని లక్ష్మీతిరుమల కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు గారి దంపతులను ఘనంగా సన్మానించడం జరిగింది.ప్రభుత్వ ఉద్యోగిగా తన బాధ్యతలను అత్యంత నిబద్ధతతో నిర్వహించి, ప్రజల మన్ననలు పొందిన మంచి అధికారిగా శ్రీనివాసులు గుర్తింపు పొందడం అభినందనీయం. వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా గడవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.