తొలి శుభోదయం న్యూస్ లింగసముద్రం:-

లింగసముద్రంలోని ప్రజా వైద్యశాలలోనిర్వహించిన ఉచిత చిన్న పిల్లల వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ఆదివారం కందుకూరులోని శక్తి చిన్న పిల్లల హాస్పిటల్ వైద్యులు డా. కెవి అశోక్ చౌదరి లింగసముద్రంలో చిన్నారుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి సుమారు
40 మంది చిన్నారులను పరీక్షించి వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా డా.అశోక్ చౌదరి మాట్లాడుతూ, ఈ ఉచిత వైద్య శిబిరంలో చూపించుకున్న చిన్నారులఓపీ కార్డును కందుకూరులోని తమ హాస్పిటల్లో నెల రోజులలో ఎన్ని సార్లైన వచ్చి ఉచితంగా చూపించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *