తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామము,మండల ప్రాథమిక పాఠశాల పి.యం. లో చదువుతూ ఆంధ్రప్రదేశ్ డా బి ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల సింగరాయకొండలో 5వ తరగతికి ప్రవేశం సాధించిన విద్యార్థిని దుగ్గిరాల లక్ష్మీ పూర్ణిమ అభినందిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు డా బి ఆర్ అంబేద్కర్ చిత్ర పఠముతో పాటు పుస్తకాలను బహుకరించారు.ఈ కార్యక్రమంలో ఆ ప్రధానోపాధ్యాయిని తాటితోటి వరలక్ష్మి మాట్లాడుతూ, సుస్మా సాధించిన ఈ విజయాన్ని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.విద్యార్థులు కష్టపడి చదివితే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని తెలిపారు.న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను గుర్తుచేస్తూ, విద్య ద్వారానే వ్యక్తి అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. విద్యార్థులు అంబేద్కర్ మార్గంలో నడుచుకుని ఉన్నత స్థానాలకు చేరాలని సూచించారు.ఈ సందర్భంగా లక్ష్మీ పూర్ణిమ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తనకు ప్రోత్సాహం అందించిన గురువులకు మరియు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.