తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

మార్కాపురం జిల్లా గిద్దలూరు అగ్నిమాపక శాఖ వారి ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్గిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖర రావు సోమవారం తెలిపారు. 14వ తేదీ అగ్నిమాపక శాఖ కార్యాలయం ఆవరణలో అగ్ని ప్రమాదాల నివారణపై స్టాల్స్ ఓపెన్ చేయడం జరుగుతుందని 15వ తేదీన గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అవగాహన కార్యక్రమాలు 16వ తేదీన అపార్ట్మెంట్లలో ప్రమాదాల నివారణ, 17 పాఠశాలలలో అవగాహన కార్యక్రమాలు 18వ తేదీన ఎల్పిజి గ్యాస్ గోడౌన్స్ 19వ తేదీన హాస్పిటల్స్ లో అవగాహన కార్యక్రమాలు, 20వ తేదీన అగ్నిమాపక శాఖ కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుందని చంద్రశేఖర రావు అన్నారు. వారం రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాలలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను చర్యలను ప్రజలకు అవగాహన కల్పిస్తామని చంద్రశేఖర రావు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *