తొలి శుభోదయం న్యూస్ దొనకొండ:-
దొనకొండ మండలం, మల్లంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ₹11 లక్షల వ్యయంతో ధాత వడ్లమూడి భూపాల్ గారి సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి , దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి , మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు, యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కంప్యూటర్లను ఉచితంగా అందజేసిన వడ్లమూడి భూపాల్ గారిని మంత్రి మరియు డా. గొట్టిపాటి లక్ష్మి ప్రత్యేకంగా అభినందించారు. గ్రామంలో విద్యాభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ప్రారంభించడం గర్వకారణమని తెలిపారు.
