తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండలంలోని ఎంపీపీఎస్ వెస్ట్ పాఠశాలలో ఎంఈఓలు పర్యటించి పాఠశాల నిర్వహణ, విద్యా కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా వారు జీఎఫ్ఎల్‌ఎన్ (GFLN), విద్యార్థుల ప్రవేశోత్సవ కార్యక్రమాలు, మధ్యాహ్న భోజన (MDM) రిజిస్టర్లు మరియు స్టాక్ వివరాలను పరిశీలించారు.
అంగన్‌వాడీ కేంద్రం నుండి పాఠశాలకు చేరిన విద్యార్థుల అడ్మిషన్లను కూడా పరిశీలించి, ప్రవేశాల పెంపు పై ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులతో చర్చించారు ఒకే రోజు 18 మంది విద్యార్థులను చేర్చడంను అభినందించారు . గ్రామంలో పేరెంట్స్, హెడ్మాస్టర్స్, టీచర్స్‌తో సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని అవగాహన కల్పించారు.
పాఠశాలలో ఇంగ్లీష్‌లో విద్యార్థులు ప్రావీణ్యం సాధిస్తున్నారని, గ్రామస్థులు, తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అభినందించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన బోధన, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించి, పేరెంట్స్‌ను ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మార్చాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు కత్తి శ్రీనివాసులు మరియు ఆవుల శ్రీనివాసరావు ఉపాధ్యాయులు సురేంద్ర శ్రీదేవి సుజాత అండలమ్మ అంగన్వాడీ కార్యకర్త సుజాత పాఠశాల ఎస్ఎంసి సభ్యులు పాల్గొని ఎన్రోల్మెంట్ డ్రైవ్ విజయవంతం చేశారు.