కేసులో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.,
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
దొనకొండ మండలంలోని ఒక గ్రామానికి చెందిన 25 సంవత్సరాల వ్యక్తి, 14 సంవత్సరాల బాలికను మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుంది. 05.03.2022 తేదీ సాయంత్రం సుమారు 6.00 గంటల సమయంలో, బాలిక తల్లిదండ్రులు ఇంటి వద్ద లేని సమయంలో, ముద్దాయి మాయమాటలు చెప్పి ఆమెను తీసుకెళ్లాడు. తల్లిదండ్రులకు తెలియకుండా బాలికను హైదరాబాద్‌కు తీసుకెళ్లి, అక్కడ ఒక గదిలో ఉంచి, ఆమె ఇష్టానికి విరుద్ధంగా బలవంతంగా అత్యాచారం చేశాడు. తర్వాత ఇంటికి చేరిన బాలిక నుంచి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు దొనకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అప్పటి ఎస్‌ఐ బి. ఫణిభూషణ్ గారు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు నిమిత్తం కేసును అప్పటి పొదిలి సీఐ యు. సుధాకర్ రావు గారికి అప్పగించారు. సీఐ గారు సమగ్రంగా దర్యాప్తు చేసి, ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తదుపరి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయటం జరిగింది.పోలీసులు సమయానుసారం సాక్షులను కోర్ట్ నందు హాజరు పరుచగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు ప్రాసిక్యూషన్ తరుపున వాదించారు. జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో ప్రత్యేక పోక్సో మానిటరింగ్ టీం ద్వారా సమర్థవంతంగా ట్రయల్ నడిపి సరైన సాక్షాదారాలతో నిందితుడుపై పలు సెక్షన్ ల క్రింద నేర నిరూపణ చెయ్యడంతో 13.04.2026న ఒంగోలులోని గౌరవ POCSO కోర్ట్ జడ్జి శ్రీ కె.శైలజ గారు నిందితుడుకి మూడు సంవత్సరాలు జైలు శిక్ష రూ.5000/-.వేల రూపాయలు జరిమానా విధించారు.పై కేసులో ముద్దాయికి శిక్ష పడటంలో కృషిచేసిన పోలీస్ అధికారులను మరియు కోర్ట్ లైజన్ ASI E.V స్వామి, కానిస్టేబుల్ యల్లమంద, దొనకొండ కానిస్టేబుల్ వి. జగదీశ్ కుమార్,స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు ని జిల్లా ఎస్పీ అభినందించారు.