తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
ప్రపంచంలో భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను అత్యుత్తమంగా తీర్చిదిద్దుటలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తన శక్తి యుక్తులన్నింటినీ ధారపోసి భారత జాతికి ఎనలేని సేవలు అందించారని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు అన్నారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కాపురం కోర్టు సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ అణగారిన వర్గాల సంక్షేమానికి ఆయన రాజ్యాంగ రచనకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు బూర్జువా,పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సామాన్యుల హక్కుల కోసం కృషి చేశారని గుర్తు చేశారు.
సామాన్యుల కోసం ఆయన తపించడం వెనుక అన్ని వర్గాల శ్రేయస్సును ఆయన దృష్టిలో ఉంచుకున్నారనే వాస్తవాన్ని నేటి తరం గుర్తించాలన్నారు…..