తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో మంగళవారం అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని గిద్దలూరు తాహశీల్దార్ ఆంజనేయ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అగ్గి ప్రమాదాల సమయంలో మంటలను ఆర్పేందుకు ఎటువంటి వస్తువులను ఉపయోగిస్తామో అధికారులకు ప్రజలకు అవగాహన కల్పించినట్లు అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖర రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక,రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు సిబ్బంది తోపాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *