తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పొదుపు సంఘాల సభ్యులకు 2027 జనాభా గణనపై అవగాహన కార్యక్రమాన్ని మండల తాసిల్దార్ ఎన్ వి బి రాజేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ గారు మాట్లాడుతూ, తమ పరిధిలోని అన్ని పొదుపు సంఘాల సభ్యులకు https://se.census.gov.in/ద్వారా స్వీయ గణన (Self Enumeration) పై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హాజరైన వివోఏలు మరియు పొదుపు సంఘాల లీడర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడింది. ఫీల్డ్ ట్రైనర్ అర్రిబోయిన రాంబాబు, వివోఏలు ఏ పీ ఎం భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొని సభ్యులకు మార్గదర్శకత్వం అందించారు.
ఇక స్వీయ గణనకు సంబంధించి జరుగుతున్న రెండో విడత శిక్షణ కార్యక్రమంలో ఎన్యుమరేటర్లకు ఫీల్డ్ ట్రైనర్ అంబటి బ్రహ్మయ్య అవగాహన కల్పించారు.
అంతేకాకుండా, ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు స్వీయ గణన నమోదు చేసుకుని, మే 1వ తేదీ నుండి జనాభా లెక్కలను సేకరించే అధికారులకు తమ Self Enumeration IDలను అందించి, జనాభా గణన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలని తాసిల్దార్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏ ఎస్ ఓ శ్రీనివాసులు ఫీల్డ్ ట్రైనర్స్ మరియు సూపర్వైజర్లు పాల్గొన్నారు.