తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్ జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో బృందావనం కు చెందిన శీలం సభాపతి గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి భార్య శీలం కోటేశ్వరి సహకారంతో గురువారం స్థానిక ఆర్టీసీ బస్ డిపోలోని పేదలకు, అనాధలకు, యాచకులకు పామూరు రోడ్డులో అందులకు కోవూరు రోడ్డులోని ఒంటరి వృద్ధులకు ఉప్పు చెరువు 5వ లైనులో ఉన్న నూతన ఎరూషలేము ప్రార్థన మందిరం బ్రదర్ కుడుముల మహేష్ గారి చేతుల మీదుగా భోజనం ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీదలను కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం కన్నా గొప్ప సేవ లేదన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భార్య మరియు కుటుంబ సభ్యులకు సేవాసమితి వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చనమాల శ్రీనివాసరావు, కార్యదర్శి శీలం వెంకటేష్, ప్రేమ్ బాబు, శివ, నితీష్, రూపేష్ ,నవీన్, యశ్వంత్, అభిలాష్ పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *