తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి నియోజకవర్గంలోని గ్రామ డ్వాక్రా సంఘాల సహాయకులకు (VOAs – Village Organisation Assistants) ఉచిత స్మార్ట్‌ఫోన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం దర్శి ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రధాన అతిథిగా పాల్గొని స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో దర్శి APM రజియా బేగం గారు, దొనకొండ APM జి. వెంకటేశ్వర్లు గారు, కురిచేడు APM ఏ. సీమోను గారు, ముండ్లమూరు APM హనుమంతరావు గారు, తాళ్లూరు APM పి. దేవరాజు గారు పాల్గొని పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.డా. లక్ష్మీ గారితో పాటు మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు గారు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు, దర్శి, కురిచేడు, ముండ్లమూరు, దొనకొండ మండలాల టిడిపి అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, పిడతల నేమిలయ్య, కూరపాటి శ్రీను, మోడీ ఆంజనేయులు, దర్శి టౌన్ టిడిపి అధ్యక్షులు చిన్నా గారు, అలాగే నియోజకవర్గంలోని టిడిపి నాయకులు, కూటమి శ్రేణులు, ఐదు మండలాల సీసీలు మరియు వివోఏలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.మండలాల వారీగా స్మార్ట్‌ఫోన్ల పంపిణీ వివరాలు:1. దర్శి – 38
- దొనకొండ – 32
- కురిచేడు – 28
- ముండ్లమూరు – 43
- తాళ్లూరు – 36
మొత్తం – 177
తదుపరి, డా. గొట్టిపాటి లక్ష్మీ గ్రామ డ్వాక్రా సంఘాల సహాయకులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.