తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు యూటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ నందు 992 మార్కులు సాధించిన స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచిన యూటీఎఫ్ సభ్యులు సయ్యద్ సాధిక్ యొక్క కుమార్తె సయ్యద్ అశ్రిఫాకు అభినందనలు తెలియజేస్తూ ఘన సన్మానాన్ని చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ గిద్దలూరు పేరును రాష్ట్రస్థాయిలో నిలపిన ఆశ్రిఫాకు, ఈమే తల్లిదండ్రులకు, ఉత్తమ విద్యా బోధన అందించిన శ్రీ జీవన జ్యోతి విద్యా సంస్థల అధినేతలకు, లెక్చరర్ల సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం జిల్లా కార్యదర్శి డాక్టర్ మొర్రి.పిచ్చయ్య, మహిళా కార్యదర్శి మాధవి దేవి, జిల్లా సిపిఎస్ కన్వీనర్ ఆవులరాజు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ డైరెక్టర్ వేమయ్య, గిద్దలూరు మండల ప్రధాన కార్యదర్శి బాల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ఖాదర్, రాచర్ల మండల అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు రంగారెడ్డి, రఘురాం, మూడు మండలాల సంఘ బాధ్యులు మరియు సభ్యులు పాల్గొని స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కు అభినందనలు తెలియజేసి ఘన సన్మానం చేశారు