తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో పోషన్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా కారుమంచి అంగన్వాడి కేంద్రం లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సూపర్వైజర్ జి జ్యోతి పాల్గొని పిల్లల యొక్క పోషణ విధానం ఎదుగుదలలో వచ్చే మార్పులకు అనుగుణంగా అందించే పౌష్టికాహారం పై వివరించారు. పిల్లలు రెండు సంవత్సరాల లోపు మెదడు 8 శాతం పెరుగుతుందని. అందుకనే పోషణ కలిగిన ఆహారం అందించాలని అన్నారు. ఎప్పుడు కలిసి మెలిసి ఉంటూ నిత్యం మాట్లాడించే విధంగా వారితో మమేకం అవ్వాలని అన్నారు పూర్వకాలంలో పిల్లల్లో ఆరోగ్యం రోగనిరోధక శక్తిని పెంచే విధంగా మన తాతలు,తండ్రులు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తినిపించేవారని అన్నారు. భాషా పరమైన అంశాలు కథలు భవిష్యత్తు బాటలు వేసే విధంగా తగిన సూచనలు సలహాలు పిల్లల్లో తెలిసేలా వారికి తెలియచేయాలని అన్నారు. ప్రస్తుతం తేలికపాటి ఆహారం పిల్లలకు అందించాలి జంక్ ఫుడ్ పై ఎక్కువ మక్కువ పెరుగుతుందని వాటిని నివారించే విధంగా ఇంటి వద్ద పప్పు దినుసులతో తయారుచేసిన ఆహారాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు కొప్పోలు సమత,నాగరాజుకుమారి, శిరీష, రమ, పద్మజ,పిల్లలు మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు