తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచిన మన స్థానిక శ్రీ ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులను బుధవారం అభినందించడం జరిగింది. CEC విభాగంలో 500 మార్కులకు గానూ 493 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలోనే మొదటి ర్యాంక్ (State First Rank) కైవసం చేసుకున్న లోకేశ్వరి ధృతిని, అలాగే MPC విభాగంలో 470కి 463 మార్కులతో టౌన్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జంపు మంజులను శాలువాతో సత్కరించి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను. ఎంతో కష్టపడి చదివి, తమ తల్లిదండ్రులకు మరియు మన ప్రాంతానికి మంచి పేరు తీసుకువచ్చిన ఈ బిడ్డలను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. భవిష్యత్తులో వీరు మరిన్ని ఉన్నత చదువులు అభ్యసించి, సమాజానికి మేలు చేసే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
