తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు ఈరోజు అంతర్జాతీయ పుస్తక దినోత్సవం మరియు ప్రఖ్యాత ఆంగ్ల నాటక రచయిత విలియం షేక్స్పియర్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ప్రఖ్యాచ రచయిత జన్మదినోత్సవాన్ని ప్రపంచ పుస్తక దినోత్సవం గా మరియు ఆంగ్ల భాషా దినోత్సవం గా జరుపుకుంటారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రవికుమార్ తెలియజేశారు. పుస్తకాల్ని అధ్యయనం చేయడం మరియు అందులోని విషయాన్ని ఆకలింపు చేసుకోవడం ద్వారా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని, ప్రపంచాన్ని శోధించవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండల నరేంద్ర మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు అందరూ కూడా పుస్తక పఠనాన్ని తమ జీవనశైలిగా మార్చుకోవాలని ఉద్బోధించారు. తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ కే. సుజాత మాట్లాడుతూ పుస్తక పఠనం మనల్ని నూతన ప్రపంచంలోకి తీసుకువెళుతుందని, పుస్తక పఠనం ద్వారా సమాజాన్ని అర్థం చేసుకొని, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని తెలియజేశారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కళాశాల ఆంగ్లశాఖ తరపున అధ్యాపకులు డాక్టర్ పి రాజగోపాల్ మాట్లాడుతూ షేక్స్పియర్ సార్వజనీన రచయిత అని, అతని నాటకాల్లోని అంశాలు, ఇతివృత్తాలు నేటి సమాజానికి కూడా ఎంతో సందేశాన్ని ఇస్తాయని తెలియజేశారు. కళాశాల రాజనీతి శాస్త్ర అధ్యాపకులు శ్రీ కె నరేష్ రాజా మాట్లాడుతూ మనం కదలకుండా ప్రపంచం మొత్తాన్ని చుట్టి రావడానికి అవకాశం కల్పించే గొప్ప ఆయుధమే పుస్తకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వృక్ష శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ ఎన్ .తిరుపతి స్వామి, అధ్యాపకులు డాక్టర్ ఎన్వి శ్రీహరి, డాక్టర్ డి. రామాంజనేయులు, డాక్టర్ జె. హనుమంతరావు, శ్రీ ఎం. లూధర్, శ్రీమతి సిహెచ్.అలేఖ్య తదితరులు పాల్గొన్నారు. కళాశాలలో బిఏ స్పెషల్ ఇంగ్లీష్ చదివి, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ (EFLU) సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసిన కళాశాల విద్యార్థిని ఎస్కే. షర్ఫున్నీసా మాట్లాడుతూ పుస్తక పఠనం మన యొక్క ప్రపంచాన్ని విస్తృత పరుస్తుందని, ఈ కళాశాలలో అలవాటైన పుస్తక పఠనం ద్వారానే తాను ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నానని తెలిపారు. ప్రస్తుత విద్యార్థులు కూడా అధ్యాపకులు చెప్పే విషయాన్ని శ్రద్ధగా విని తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని సూచించారు.ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా, గత డిసెంబర్లో నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్ కు సంబంధించిన వ్యాసాలతో కూడిన పుస్తకాన్ని ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రవికుమార్ మరియు సిబ్బంది ఆవిష్కరించడం జరిగింది. కళాశాల తెలుగు, రాజనీతి శాస్త్రం మరియు ఆంగ్ల విభాగాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
