తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
ప్రకాశం జిల్లా టంగుటూరు ప్రాజెక్టు పరిధిలోని అంబేద్కర్ నగర్, ముదిరాజ్ కాలనీలలో స్కూల్ రెడీనెస్ మేళా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని పిడి శ్రీమతి ఎం. నాగమణి ప్రారంభించగా, సిడిపిఓ శ్రీమతి వై. అంజమ్మ, సూపర్వైజర్ బి. సుచరిత, ITC ప్రథమ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వై. వెంకటలక్ష్మి, ఎంపీపీ ఆదర్శ స్కూల్ హెచ్ఎం డి. శ్రీధర్ పాల్గొన్నారు.
ఈ మేళాలో 3–6 సంవత్సరాల పిల్లలు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని పిల్లల అభివృద్ధి స్థాయిని తెలుసుకున్నారు. మొత్తం 15 మంది పిల్లలకు అసెస్మెంట్ నిర్వహించి వారి గ్రోత్ వివరాలను తల్లిదండ్రులకు వివరించారు. ఇంట్లో లభించే సాధారణ వస్తువులతో పిల్లల అభివృద్ధిని మెరుగుపరచుకునే పద్ధతులపై అవగాహన కల్పించారు.
అంగన్వాడీ నుంచి ఎలిమెంటరీ స్కూల్కు వెళ్లే పిల్లల కోసం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి, వారి విద్యా స్థాయిని స్కూల్ హెచ్ఎంకు తెలియజేశారు. ఈ కార్యక్రమం చిన్నారుల విద్యాభివృద్ధికి కీలకంగా మారిందని నిర్వాహకులు తెలిపారు.