తొలి శుభోదయం న్యూస్ కొత్తపట్నం:-
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో గురువారం యస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జ రెడ్డి పర్యటించారు.
రంగాయపాలెం గ్రామపంచాయతీని సందర్శించి ఇటీవల మరణించిన ఈగ బాలనాగు కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా వారి కుటుంబానికి ధైర్యం చెప్పి, వారి సమస్యలను తెలుసుకొని అవసరమైన సహాయం అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముందుగా చైర్మన్ సొల్ల బొజ్జ రెడ్డిని డివిజనల్ పంచాయతీ అధికారిని ఆర్. పద్మ కలిసి బొకేతో స్వాగతించారు. మండలంలోని పలు సమస్యలు, అంశాలపై డివిజనల్ పంచాయతీ అధికారినితో చైర్మన్ చర్చించారు. ఈ కార్యక్రమంలో డి.పి.ఆర్.సి.డి.సి మల్లికార్జున్ ఎంపీడీవో, డిప్యూటీఎంపీడీవో,ఎం.ఎస్.జి.ఓ,స్వర్ణ గ్రామ సిబ్బంది మరియు డి.పి.ఆర్.సి సిబ్బంది పాల్గొన్నారు.