తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :-

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాచర్ల సబ్ ఇన్‌స్పెక్టర్ పి. కోటేశ్వరరావు మరో కీలక అడుగు వేశారు. జిల్లా ఎస్పీ .. ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో తనదైన ముద్ర వేస్తున్నారు.సమస్యను గుర్తించి.. వెనువెంటనే పరిష్కారం. రాచర్ల మండల పరిధిలోని మోడల్ స్కూల్ సమీపంలో ఉన్న మలుపు అత్యంత ప్రమాదకరంగా మారిందని గుర్తించిన ఎస్ఐ , బుధవారం అక్కడ కాన్వెక్స్ మిర్రర్ (Convex Mirror) ను ఏర్పాటు చేశారు.దృష్టి సారించిన ఎస్సై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పోవడం వల్ల ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గమనించి, ఈ పరిష్కారాన్ని అమలు చేశారు.
సాంకేతికతతో భద్రత ఈఅద్దం వల్ల మలుపు అవతలి వైపు నుండి వచ్చే వాహనాలను డ్రైవర్లు ముందే గుర్తించే వీలుంటుందని ఆయన వివరించారు.
ప్రజల కోసం ఎస్సై సూచనలు
ఈసందర్భంగా ఎస్ఐ పి. కోటేశ్వరరావు , మాట్లాడుతూ కేవలం సౌకర్యాలు కల్పిస్తే సరిపోదని, వాహనదారుల బాధ్యత కూడా ముఖ్యమని పేర్కొన్నారు. అతివేగం ప్రాణాంతకమని, నియంత్రిత వేగంతో ప్రయాణించాలని హెచ్చరించారు.
ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు రోడ్డు దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు.
ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుని, ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్న ఎస్ఐ పి. కోటేశ్వరరావు , పనితీరుపై స్థానికులు మరియు మోడల్ స్కూల్ సిబ్బంది ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, శాంతిభద్రతలతో పాటు సామాజిక భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్న ఆయన చొరవ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది……..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *