మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం:-
పంచాయతీ రాజ్ వ్యవస్థ లో అనేక సంస్కరణలు తీసుకువచ్చి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పనిచేస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హల్లో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు, ఒంగోలు, సంతనూతలపాడు శాసన సభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు, శ్రీ బి ఎన్ విజయకుమార్లతో కలసి పాల్గొన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ, మహాత్మాగాంధీ గారు పల్లె సీమలు అభివృద్ధి చెందాలి, గ్రామ స్వరాజం రావాలని నినాదం తీసుకురాగా, డా. బిఆర్ అంబేద్కర్ గారు గ్రామసీమలు ప్రత్యేకంగా అభివృద్ధి చెందాలని రాజ్యాంగంలో పొందపర్చడం జరిగిదన్నారు. స్థానిక పాలనా వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించడంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రాధాన్యతను గుర్తించి ప్రత్యేక రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థకు చట్టబద్దత తీసుకురాగా, ఆనాటి నుండి ప్రతి ఏటా ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాలు ప్రగతి పథంలో నడిచినప్పుడే దేశాభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, నిధుల వినియోగం లాంటి అంశాలను సమన్వయం చేయడం కోసమే పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పాటు అయినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామాల అభివృద్ధి కి ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతో పాటు పంచాయతీ వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. స్వర్ణ గ్రామంలో ప్రత్యేక సిబ్బందిని నియమించడంతో పాటు వారి పర్యవేక్షణకు మండల, జిల్లా స్థాయి అధికారులను కూడా నియమింఛి పూర్తీ స్థాయిలో అభివృద్ధి సంక్షేమాన్ని సమర్ధవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. గుండమాల పంచాయతీకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం పట్ల సంబంధిత పంచాయతీ కార్యదర్శి లావణ్య ను ప్రత్యేకంగా మంత్రి అభినందించారు. గ్రామీణ స్థాయిలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే క్షేత్ర స్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు పూర్తిస్థాయిలో అర్హులైన గ్రామీణ ప్రజలకు అందేలా పంచాయత్ వ్యవస్థ పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.