తొలి శుభోదయం ప్రకాశం :-

ప్రకాశం జిల్లాలో గంజాయి రవాణా, చెలామణి పై పోలీసులు భారీ ఎత్తున పరీష్కరణ చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ పర్యవేక్షణలో ఈగల్ బృందం గత మూడు నెలలుగా రైలు మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తోంది.ఈ వ్యవధిలో 10 కేసులు నమోదు చేసి, 14 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌ కి తరలించగా, మొత్తం 100 కిలోల గంజాయి స్వాధీనం చేశారు. రైలు మార్గం ద్వారా ఒరిస్సా–తమిళనాడు మధ్య జరుగుతున్న అక్రమ రవాణా నియంత్రణలో ఈగల్ బృందం కీలక పాత్ర పోషిస్తోంది.రైలులో 3 కిలోల గంజాయి పట్టివేత గురువారం ఎర్నాకులం–లక్నో ఎక్స్‌ప్రెస్ రైలులో దాడి చేసి, ఆకారంగా గంజాయి రవాణా చేస్తున్న ఎస్. గోవిందన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 3 కిలోల గంజాయి స్వాధీనం చేశారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించారు.రైలు మార్గాల్లో కంచుకోటలా నిఘా రైళ్లలో జరుగుతున్న రహస్య రవాణాను అరికట్టేందుకు ఈగల్ బృందం రోజంతా పర్యవేక్షణ కొనసాగిస్తోంది. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫాంలు, ఇంటర్‌సిటీల్లో గట్టి తనిఖీలు చేపట్టడంతో ముఠాలు భయభ్రాంతులకు గురవుతున్నాయి.“గంజాయి రవాణా చేసే వారెవ్వరైనా జైలే గమ్యం” – ఈగల్ బృందం హెచ్చరిక ఈగల్ బృందం సిఐ సుధాకర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి రవాణా, చెలామణి, సేవించడం — ఏ రూపంలోనైనా పాల్గొన్న వారిపై ఎస్పీ గారి ఆదేశాల మేరకు కఠిన చర్యలు తప్పవు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష తప్పదని స్పష్టం చేస్తున్నాం.” అన్నారు.జిల్లాలో గంజాయి ముఠాలు పూర్తిగా నిర్మూలించే వరకు ఈగల్ బృందం ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *