తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామం లో శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ లో జరిగిన బాలల దినోత్సవ కార్యక్రమంలో చిన్నారులు గులాబీ పూలను నెహ్రూ చిత్రపటానికి సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పటైన కార్యక్రమంలో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆదర్శాలు,నేటి తరానికి అనుసరణీయమని విద్యానికేతన్ కరస్పాండెంట్ సైకం వెంకటేశ్వర రావు అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సైకం శ్రీవిద్య మాట్లాడుతూ నెహ్రూ సామాజిక స్పృహ,త్యాగనిరతి నేటి బాలలకు ఆదర్శనీయమని చెప్పారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.