తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన దర్శి మున్సిపల్ కౌన్సిలర్ వీసీ రెడ్డి గారిని దర్శి పట్టణంలోని కొత్తపాలెం ప్రాంతంలో ఉన్న వారి నివాసంలో ఆదివారం సాయంత్రం పరామర్శించారు దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్.ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, ఒంగోలు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు కాట్రాజు నాగరాజు, కొత్తపాలెం టిడిపి నాయకులు యరమల శ్రీనివాసరెడ్డి, సారెడ్డి శ్రీనివాసరెడ్డి తదితర నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.