తొలి శుభోదయం న్యూస్ కంభం :-
మార్కాపురం జిల్లా కంభం మండలంలోని పలు పెట్రోల్ మరియు డీజిల్ కొరత వున్నదని వస్తున్నటువంటి అపోహాల పైన ఈరోజు ఆదివారం నాడు కంభం మండలం తహశీల్దార్ వి. కిరణ్, ఆర్.ఐ టి. ఆంజనేయులు మరియు వీఆర్వోలు మండల పరిధిలోని బంకులను పరిశీలించి ప్రజలకు పెట్రోల్ మరియు డీజిల్ అందరికి అందుబాటులో వున్నదని ఎవ్వరు కూడా పెట్రోల్ మరియు డిజిల్ లేదు అనే అపోహాలను నమ్మవద్దు అని ఏఏ బంకు నందు ఎంత పెట్రోల్ మరియు డీజిల్ ఉన్నదో వాటి వివరాలను తెలిపారు. కందులాపురం తర్లుపాడు రోడ్డులో బంకు నందు డీజిల్ 1000 లీటర్లు, పెట్రోల్ 2100 లీటర్లు,కాగితాల గూడెం బేస్తవారిపేట రోడ్డు బంకు నందు డిజిల్ 400 ల లీటర్లు, పెట్రోల్ 200 ల లీటర్లు, స్టేట్ బ్యాంకు బంకు నందు డీజిల్ 200 ల లీటర్లు, పెట్రోల్ 3000 ల లీటర్లు, తురిమెళ్ళ గ్రామం నందు బంకులో డిజిల్ 10854 లీటర్లు,పెట్రోల్ 7500 ల లీటర్లు స్టాక్ ఉన్నదని కావున కంభం మండలలోని ప్రజలు పెట్రోల్ మరియు డీజిల్ నకు ఎటువంటి కొరత లేదని ఆందోళన పడవలసిన అవసరం లేదని తహశీల్దార్ వి.కిరణ్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *