తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ఒంగోలు పట్టణంలో ట్రాఫిక్ సీఐ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డ్రైవర్లకు వివరించారు.వాహనం నడుపుతున్నప్పుడు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం, అధిక వేగం వద్ద డ్రైవింగ్ చేయకపోవడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. అలాగే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలని తెలిపారు.ఈ అవగాహన కార్యక్రమం ద్వారా డ్రైవర్లు రోడ్డు భద్రతపై మరింత జాగ్రత్తగా ఉండాలని సీఐ కోరారు.