తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలపై వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ మే ఆరో తేదీ విజయవాడ ధర్నా చౌక్ లో తలపెట్టిన మహా ధర్నాకు ఉపాధ్యాయ సంఘాల సహకార అభ్యర్థనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర బాధ్యులు, ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ ప్రభాకర్ రెడ్డి ని కలసి మహాధర్నాలో పాల్గొనాలని వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కేశవరపు జాలి రెడ్డి కోరడమైనది.. దానికి వారు స్పందిస్తూ ప్రధాన ఉపాధ్యాయ సమస్యలు పిఆర్సి కమిటీ ఏర్పాటు, 30% ఐ ఆర్ ప్రకటన, 4 డి ఏ మంజూరు, పెండింగ్ బకాయిలు చెల్లింపు మా ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలు హెల్త్ కార్డు మంజూరు, మరణించిన ఉపాధ్యాయుల పిల్లలకు కారుణ్య నియామకాలు సమస్యలపై స్పందించే ప్రతి సంఘ కార్యక్రమాలకు మా మద్దతు ఉంటుందని, మే 6 వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ చేపట్టే మహా ధర్నాలో మేము పాల్గొంటామని వారు తెలియజేశారు.