సింగరాయకొండ సిఐ శ్రీహరికి వృత్తి జర్నలిస్ట్ లు ఫిర్యాదు.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
కొద్ది రోజులుగా వృత్తి జర్నలిస్ట్ ల పై వారి నైతికత పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ లు పెట్టి అపఖ్యాతి పాలు చేస్తున్న వారి పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సింగరాయకొండ వృత్తి జర్నలిస్ట్ లు సి ఐ శ్రీహరికి ఫిర్యాదు చేశారు. ఎవరు పడితే వారు తమ ప్రాపకం కోసం టార్గెట్ గా చేసుకుని వృత్తి జర్నలిస్ట్ ల పై దాడులు, హత్యలు చేయడం బెదిరింపులకు పాల్పడడం పరిపాటి అయి పోయిందని సి ఐ దృష్టికి తీసుకు పోయారు. గత రెండు రోజుల క్రితం చిత్తూరు వృత్తి జర్నలిస్ట్ పై జరిగిన దారుణ హత్యని ఖండిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సింగరాయకొండ పోలీస్ స్టేషన్ సమీపంలో చేసిన నిరసన ప్రదర్శన సందర్భంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టడాన్ని తప్పు పట్టారు. జర్నలిస్ట్ లు నిరసన ప్రదర్శన చేస్తే ఎవరికి ఇబ్బంది అనిపించిందో గానీ కందుకూరు కి చెందిన ఒక రాయల్ ఇన్ఫిల్డ్ షో రూమ్ వారి ఐడి నుండి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్య చేస్తూ పెట్టిన పోస్ట్ కాపీ లను జత చేసి వృత్తి జర్నలిస్ట్ లు తమ ఫిర్యాదును సి ఐ కి ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి వ్యక్తులను చట్టపరంగా శిక్షించాలని కోరారు. ఫిర్యాదు తీసుకున్న సి ఐ శ్రీహరి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సింగరాయకొండ ఇంచార్జి ఎస్సై మహేంద్రని ఆదేశించారు. సి ఐ ని కలిసి ఫిర్యాదు చేసిన వారిలో సింగరాయకొండ వృత్తి జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.