కార్మికుల పర్వదినం మేడే సందర్బంగా జరుగుమల్లి మండలం, చింతలపాలెం గ్రామం, జరుగుమల్లి గ్రామాలలో సీపీఎం ఆధ్వర్యంలో ఎర్ర జెండాలను ఎగుర వేయటం జరిగింది.ఈ సందర్బంగా సీపీఎం మండల కన్వీనర్ వేసుపోగు మోజెస్ మోజెస్ మాట్లాడుతూ 140 సం,ల క్రితం అమెరికా దేశం లోని చికాగో నగరం లో కార్మికుల హక్కుల కోసం జరిగిన ర్యాలీ మీద పాలకులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అనేక మంది చనిపోయారు. ఈ కాల్పుల్లో గాయపడిన అనేక మంది రక్తం తో తడిచిన చొక్కాలతో ప్రదర్శన లో పాల్గొనటం వల్లే ఎర్ర జండా ఏర్పడింది అని తెలిపారు. సంపద కొద్దీ మంది కుబేరుల వద్ద పొగవటం వల్ల 90% మంది ప్రజలు పేదిరకం లో మగ్గుతున్నారు అని తెలిపారు.పోరాడి సాధించుకున్న 8 గం,, ల పనిని ,సమ్మె హక్కును, యూనియన్ లు పెట్టుకొనే హక్కను, మాట్లాడే హక్కును కాపాడుకోవలసిన పరిస్థితి వచ్చింది. కార్మిక, కర్షక, ఉద్యోగాల ఐక్యత పెంచుకోవాలి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో సీపీఎం నాయకులు తన్నీరు సుబ్బారావు, గుడిపూడి అంకయ్య, బెజవాడ శివయ్య, కేవీ. శేషయ్య, బెల్లం సుబ్బారావు, ముప్పారాజు శ్రీనివాసరావు, కే. యలమంద తదితరులు పాల్గొన్నారు…..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *