శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి పురస్కరించుకుని, నేడు మన కందుకూరు ప్రాంత ప్రజల ఇష్టదైవం, ప్రముఖ పుణ్యక్షేత్రం మాలకొండపై శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మన నియోజకవర్గ ప్రజలందరిపై ఆ స్వామి వారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించాను.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించాను. అంతరాలయం, క్యూలైన్లు, కళ్యాణకట్ట మరియు గొడుగు బండ ప్రాంతాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులకు సూచనలు చేశాను. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు నిరంతరం తాగునీరు, వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవడం జరిగింది. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పార్కింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులను ఆదేశించాను.భక్తులందరికీ స్వామి వారి దర్శనం ప్రశాంతంగా జరిగేలా చూడటమే మా ప్రథమ కర్తవ్యం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *