తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమ (పీజీఆర్ఎస్ ) సమయంలో మార్పులు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి కాలం ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈనెల 4వ తేదీ( సోమవారం) న కలెక్టరేట్లో జరగబోవు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించను న్నట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని ప్రజలు మార్పును గమనించాలని కోరారు. ప్రజలు నిర్దేశించిన సమయానికి కార్యక్ర మానికి చేరుకొని వారి వారి సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు అంద జేయాలని సూచించారు.