మార్కాపురం జిల్లాలోని పిర్యాదుదారులకు తెలియజేయునది ఏమనగా, వేసవి కాలంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నందున మరియు వడగాల్పులు వీచుతున్న దృష్ట్యా, తేది 04-05-2026, సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీ కోసం) కార్యక్రమంను ఉదయం 8.00 గంటల నుండి 11.00 గంటల వరకు నిర్వహించబడునని జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఒక ప్రకటనలో తెలియజేశారు.అందువలన, దూర ప్రాంత గ్రామాలు మరియు పట్టణం నుండి వచ్చే ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను ఉదయం 8.00 గంటల నుండి 11.00 గంటల వరకు అందచేయవచ్చు. మార్చిన సమయాన్ని పిర్యాదుదారులు అందరూ గమనించగలరు. అలాగే, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఫిర్యాదుదారులు కార్యక్రమం ముగిసిన వెంటనే తమ గృహాలకు చేరుకోవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *