ఒంగోలు భాగ్యనగర్ 4వ లైన్, 11వ అడ్డరోడ్డులో నిర్వహించిన ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి గారు, ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి, టీడీపీ యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ గారితో కలిసి పాల్గొన్నాను.ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధనరావు , టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ , మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య , చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య, కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు, యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షిన్ బాబు , పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ కామేపల్లి సీతారామయ్య, గ్రంథాలయ చైర్మన్ శ్రీమతి సుచిత్ర వీరయ్య చౌదరి , ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ కఠారి నాగేశ్వరరావు గారు, దర్శి ఏఎంసీ చైర్మన్ శ్రీమతి దారం నాగవేణి–సుబ్బారావు పాల్గొన్నారు.అదేవిధంగా ప్రకాశం జిల్లా ముఖ్య నాయకులు, దర్శి నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.పార్టీ కార్యకలాపాలకు మరింత బలాన్ని చేకూర్చేలా, కార్యకర్తలకు సమర్థవంతమైన వేదికగా ఈ నూతన కార్యాలయం నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *