తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్న గంజాయి మహమ్మారిపై ప్రకాశం జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో బుధవారం టాస్క్ ఫోర్స్ సీఐ భీమా నాయక్ పర్యవేక్షణలో ఏఎస్ఐ మహబూబ్ బాషా, ఈగల్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది కలిసి ఒంగోలు తాలూకా పరిధిలోని పెళ్లూరు గ్రామంలో గంజాయి వినియోగం మరియు అక్రమ రవాణా వల్ల కలిగే అనర్థాలు, శిక్షలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఏఎస్ఐ మహబూబ్ బాషా గంజాయి వాడకం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, సామాజిక ఇబ్బందులు మరియు చట్టపరమైన చర్యల గురించి వివరించారు. ముఖ్యంగా యువత ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉండి, బంగారు భవిష్యత్ వైపు అడుగులు వేయాలని సూచించారు.గ్రామంలో ఎక్కడైనా గంజాయి సాగు, అమ్మకం లేదా నిల్వ ఉన్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.