సిబ్బంది సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా వేసవి తాపం నుండి ట్రాఫిక్ సిబ్బంది రక్షణ పొందేందుకు వారికి జిల్లా ఎస్పీ గారు సమ్మర్ వెల్ఫేర్ కిట్లను జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో అందచేసినారు. ఈ సమ్మర్ కిట్ లో ఎండ తీవ్రత నుండి కాపాడే హ్యాట్స్, సన్ గ్లాసెస్,ORSL ప్యాకెట్లు, మరియు వాటర్ బాటిల్ లు ఉన్నాయి. ఈ సందర్భముగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం ఎండలో నిలబడి దుమ్ము, ధూళి లెక్కచేయకుండా ట్రాఫిక్ సిబ్బంది ఎండ తీవ్రతలో కూడా తప్పనిసరిగా విధులు నిర్వహించాల్సి ఉంటుందని, వారికి స్వీయ రక్షణ చాలా అవసరమని, ఎండకు నీరు బాగా తాగాలని, డీహైడ్రేషన్ కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. వడ దెబ్బ వంటి ప్రమాదకర పరిస్థితులకు లోను కాకుండా ORSL, నిమ్మ రసం, మజ్జిగ లాంటి ద్రవాలు సేవించాలని మరియు వేసవి కాలంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రవాణా సాఫీగా సాగుటలో ట్రాఫిక్ పోలీసుల పాత్ర అత్యంత కీలకమైనదని, వేసవిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజలకి మెరుగైన సేవలందించాలని, విధి నిర్వహణలో ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.పోలీస్ సిబ్బంది సంక్షేమంలో ఎంతో శ్రద్ద తీసుకుంటూ వేసవిలో సమ్మర్ కిట్ ను అందించిన జిల్లా ఎస్పీ గారికి సిబ్బంది ధన్యవాదాలు తెలియచేసినారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ హాజరత్తయ్య, ట్రాఫిక్ ఎస్సైలు కోటయ్య, శ్రీనివాసులు, మాల్యాద్రి, శివ ప్రసాద్ మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *