తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జీవితం ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శనీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీపతి ప్రకాశం అన్నారు.దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సంస్కరణలకు నాంది పలికిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. మొదటిసారిగా పెన్షన్ ప్రవేశపెట్టి ఆరు లక్షలకు పైగా బంజరు భూములను పేదలకు పంచిన మానవతావాది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునిగానే కాక అనేక పదవులను అలంకరించి ఆ పదవులకే వన్నెతెచ్చిన మంచి వ్యక్తి అని కొనియాడారు. అటువంటి మహనీయుని జీవితాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని ఎదగాలని కోరారు. పాఠ్యాంశాలలో ఆయన జీవితాన్ని ముద్రించి భావితరాలకు సమాజానికి ఎలా ఉపయోగపడాలో తెలియజేసే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దామోదరం సంజీవయ్య కమిటీ చైర్మన్ యాదాల అరుణ్ కుమార్ (బుజ్జి),సంతనూతలపాడు మాజీ సర్పంచి రంప తోటి అంకారావు, ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ మెంబర్ కాకి కృపారావు, ప్రొఫెసర్ హర్ష ప్రీతం, విశ్రాంత సబ్ కలెక్టర్ కత్తి పేరయ్య, కొండేపి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీపతి సతీష్, లెమ్యూల్ రాజు,వి సుందర రావు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి,షేక్ రసూల్ తదితరులు పాల్గొన్నారు.
