ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని ఉన్నతశ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఎస్ ఎమ్ ఓ కొండపి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పి ఎమ్ ఎస్ ఎమ్ ఏ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు
డాక్టర్, ధీరేందర్ డి.డి.ఓ , ఎస్ ఎం ఓ.డాక్టర్, వంశీధర్ పాల్గొని గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చిన తొలి రోజు నుంచి కాన్పు జరిగే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా వివరించారు. డాక్టర్ వంశీధర్ మాట్లాడుతూ, ప్రతి నెల 9. మరియు 10. తేదీలలో గర్భవతులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఇవ్వడం, గర్భధారణ సమయంలో మహిళలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఐరన్ మరియు కాల్షియం మాత్రలు క్రమం తప్పకుండా వినియోగించడం, రక్తహీనత సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే గర్భిణీలు మానసికంగా ప్రశాంతంగా ఉండాలని, అధిక శ్రమ చేయకూడదని, వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలియజేశారు.
అదేవిధంగా ప్రతి గర్భిణీ స్త్రీ కనీసం నాలుగు సార్లు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, బీపీ, షుగర్ వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే గుర్తిస్తే తల్లి మరియు శిశువు ఆరోగ్యాన్ని కాపాడవచ్చని వివరించారు. గర్భిణీలు సమతుల్య ఆహారంలో పాలు, గుడ్లు, ఆకుకూరలు, పండ్లు, పప్పుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా ప్రభుత్వం గర్భిణీ స్త్రీల కోసం అందిస్తున్న ప్రత్యేక వసతుల గురించి కూడా డాక్టర్ వంశీధర్ వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు, ప్రసవ సేవలు, అంబులెన్స్ సౌకర్యం, అవసరమైన మందులు ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. అదనంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ఆరోగ్య పథకాల ద్వారా గర్భిణీ స్త్రీలు లబ్ధి పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సింగరాయకొండ పరిధిలోని ఆశా వర్కర్లు, గర్భిణీ స్త్రీలు, ఆసుపత్రి సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పిస్తూ, సమయానికి ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్య సేవలు అందేలా చేస్తున్న సేవలను వైద్యులు అభినందించారు.కార్యక్రమం చివరలో గర్భిణీ స్త్రీల సందేహాలకు వైద్యులు సమాధానాలు ఇచ్చి, తల్లి మరియు శిశువు ఆరోగ్యం పట్ల ప్రతి కుటుంబం ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమం గర్భిణీ స్త్రీల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడిందని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *