తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా మాల జేఏసీ నాయకులు, మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జడ శ్రవణ్ కుమార్ హాజరు అయ్యి దళితుల మీద దాడులు చేస్తే సహించం అని , దళితులకు ఏ సమస్య వచ్చినా న్యాయ పోరాటంలో ముందు ఉంటానని జడ శ్రవణ్ కుమార్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు మాట్లాడుతూ రిజర్వేషన్ వర్గీకరణ పేరుతో దళితుల విభజించి, దళితుల రిజర్వేషన్ తీసేటటువంటి కుట్రలో భాగంగానే వర్గీకరణ చేశారు అని, ఎస్సీ రిజర్వేషన్ 20% శాతం పెంచాలి అని, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అమలు చేయాలని లేకపోతే దళితులు అందరూ ఐక్యం గా పోరాడుతాము అని హెచ్చరించారు. అదేవిధంగా ఎస్సీ లు చర్చికి పోయే క్రైస్తవులు వేరు చేయాలను దురుద్దేశంతో ,చర్చిలకు పోతే రిజర్వేషన్ రద్దు కావు అని అశోక్ బాబు తెలిపారు, ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా జేఏసీ అధ్యక్షులు శాంత కుమార్, మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శామ్యూలు, గొట్టుముక్కల యోహాన్, జిల్లా ప్రధాన సలహాదారులు రాజశేఖర్, పి శ్రీనివాసులు జి ఓబులు ఎస్ రమేష్ పి ప్రతాప్ కొప్పోలు ఏడుకొండలు, శాంత రావు, జిల్లా లక్ష్మీనారాయణ, కె.వి.కృష్ణారావు మరియు యువకులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.