తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
గిద్దలూరు మండలం లోని ఓబుళాపురం తండా గ్రామంలో నీటి ఎద్దడితో పశువులకు, తండా వాసులకు నీరు లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న గిద్దలూరు అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నిషా కుమారి గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు గ్రామ సమీపములో అటవీశాఖ నిధులతో బోరు వేయించడం జరిగింది. నీరు సమృద్ధిగా పడటంతో ఈ రోజు నీటి బోరును గ్రామస్తులతో కలసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన గిద్దలూరు అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నిషా కుమారి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ అటవీశాఖ అధికారికి అభినందిస్తూ ధన్వదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు రేంజ్ అధికారి టి.సత్యనారాయణ,డి ఆర్ ఓ శేఖర్ గౌడ్, ఎఫ్ బీ ఓ, sr peta పి. అంకయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.