వలేటివారిపాలెం తహసీల్దార్ కార్యాలయాన్ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలు, వాటిలో ఎన్ని పరిష్కరించారు, పెండింగ్ లో ఎన్ని ఉన్నాయి అనే అంశాలపై దృష్టి పెట్టారు. అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని తహసిల్దార్ మధుసూదన్ రావును ఆదేశించారు.
కొంతమంది వీఆర్వోలు విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నట్లు, అర్జీదారులను పదేపదే తిప్పుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటివారు వెంటనే తమ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. రెవిన్యూ సమస్యల పట్ల, బాధ్యతగా వ్యవహరించి పనిచేయాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *