తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :-
జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు అక్రమ జూద స్థావరాలపై వరుస మెరుపుదాడులు నిర్వహించారు. ఈ ప్రత్యేక చర్యల్లో జూదం నిర్వహిస్తున్న మరియు పాల్గొంటున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకున్నారు.ఒక దాడిలో అక్రమ జూదం నిర్వహిస్తున్న 6 మందిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.14,616 నగదు, 4 మోటార్ సైకిళ్లు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పీసీ పల్లి పీఎస్ పరిధిలోని పెద్ద ఇర్లపాడు గ్రామ శివారులో నిర్వహించిన దాడిలో 9 మందిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.5,630 నగదును స్వాధీనం చేసుకున్నారు.జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడంతో పాటు సమాజంలో నేరాలకు దారితీసే ప్రమాదం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ప్రజలు తమ పరిసరాల్లో జరుగుతున్న జూదం, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.