తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం..

మార్కాపురం బిజెపి జిల్లా అధ్యక్షుడిగా పివి కృష్ణారావును నియమిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి వి ఎన్ మాధవ్ అధికారికంగా ప్రకటించారు. జిల్లా నుండి ఎంతోమంది జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీ చేసినప్పటికీ అధిష్టానం మాత్రం పివి కృష్ణారావు కే జిల్లా అధ్యక్ష పదవి ప్రకటించడంతో పలువురు బిజెపి నాయకులు శ్యాలువ, పూలమాలల తో సత్కరించి అభినందనలు తెలిపారు. 1990 సంవత్సరం నుండి 95 సంవత్సరంలో ఏబీవీపీలో పనిచేసి 95 నుండి 2001 వరకు బిజెపి యువ మోర్చా పట్టణ అధ్యక్షునిగా మరియు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు పివి కృష్ణారావు. అదేవిధంగా 2001 నుండి 2004 వరకు మార్కాపురం పట్టణ అధ్యక్షులుగా చేశారు. 2004 నుండి 2008 వరకు ప్రకాశం జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు. 2008 నుంచి 2011 వరకు అసెంబ్లీ బిజెపి ఇన్చార్జిగా కొనసాగారు. 2014 నుండి 18 వరకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా 2018 నుండి 2026 వరకు అసెంబ్లీ ఇన్చార్జిగా కొనసాగుతూ గుర్తింపు పొందిన పివి కృష్ణారావుకు నేడు అధిష్టానం మార్కాపురం జిల్లా అధ్యక్షునిగా ప్రకటించడం హర్షనీయమని పలువురు హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్ర అధ్యక్షులు నాకు ఈ బాధ్యతను అప్పగించినందున బాధ్యతాయుతంగా జిల్లాలో బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ప్రతి కార్యకర్తను కలుపుకొని పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా పయనిస్తానని పివి కృష్ణారావు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మరియు సంబంధిత పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శాతరాజు పల్లి ప్రవీణ్, కె నాగరాజు, రామకృష్ణ, గుమ్మ రాఘవేంద్ర, జీవి రెడ్డి, బత్తుల పాలంకయ, పాటు పలువురు నాయకులు కార్యకర్తలు, కృష్ణారావుకు అభినందనలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *