తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు, ఎండల తీవ్రత వలన జాగ్రత్తగా ఉండాలని ఆర్టీసీ డిపో మేనేజర్ రాపురి శ్రీనివాసరావు అన్నారు. ప్రయాణికులు కొరకు చల్లటి నీరును అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ను సిద్ధమంగా ఉంచామని చెప్పారు. మంచినీటి సీసాల ద్వారా మంచినీటిని ప్రయాణికులు తమ దగ్గర అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు. ప్రయాణికులు కు ఏమైనా సమాచారం కొరకు కంట్రోల్ ను సంప్రదించాలని సూచించారు.