తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శనాపురి నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 13వ జాతీయస్థాయి నాటక పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దర్శి టిడిపి ఇంచార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మీ గారు.దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన Dr. గొట్టిపాటి లక్ష్మీ గారు కళాకారులను అభినందించారు. తెలుగు నాటక రంగానికి ఇలాంటి కళాపరిషత్లు ఎంతో సేవ చేస్తున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో Dr. జాన్సీ గారు, కాలువకొలను అనంత్ గారు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి-సుబ్బారావు గారు, కళాపరిషత్ కమిటీ సభ్యులు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.