మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రముఖ పుణ్యక్షేత్రం, మాలకొండపై వెలసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా భక్తుల క్యూలైన్లు, అన్నప్రసాదం తయారీ, వేసవిలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను నాగేశ్వరరావు పరిశీలించారు. అన్నప్రసాదం నాణ్యతపై భక్తులతో మాట్లాడారు. నగదు, వస్తు రూపంలో అందిస్తున్న విరాళాలను కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. భక్తితో అందిస్తున్న కూరగాయలు, బియ్యం, ఇతర వస్తువులు వృధా కాకుండా వినియోగించాలని అధికారులకు సూచించారు. లగేజీ పాయింట్, చెప్పుల స్టాండ్ వద్ద డబుల్ రేట్లు వసూలు చేస్తున్నట్లు భక్తులు ఫిర్యాదు చేయగా, పాటదారులను ఎమ్మెల్యే హెచ్చరించారు. అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొండపై పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నాగేశ్వరరావు పరిశీలించారు. వలేటివారిపాలెం మండల టిడిపి అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, నేతలు కాకుమాని హర్ష, కామినేని అశోక్ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.