కందుకూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణం నందు మండల న్యాయ సేవా అధికార సంఘం వారి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగినది. ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్న మండల లీగల్ సెల్ అధారిటీ చైర్మన్ మరియు సీనియర్ సివిల్ జడ్జి కే.కే.వి.బుల్లికృష్ణ గారు మాట్లాడుతూ మండల లీగల్ సెల్ అథారిటీ తరఫున న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహించి బాల బాలికలను చైతన్యవంతం చేస్తున్నామని దానిలో భాగంగా ఈరోజు బాల్య వివాహముల నిషేధం చట్టం గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ చట్ట ప్రకారం బాలికలు కనీసం 18 సంవత్సరముల వయసు నిండిన తర్వాత మాత్రమే వివాహం తలపెట్టాలని కుటుంబములోని తల్లిదండ్రులు పెద్దలు అందరూ కూడా బాలికలను చదివించి ప్రోత్సహించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. మైనర్ బాలికల వివాహాలు చట్టరీత్యా నేరం ఒకవేళ ఈ చట్టానికి భిన్నంగా వ్యవహరిస్తే బాధిత బాలికలు మండల్ లీగల్ సెల్ అథారిటీ ని, పోలీసులను,స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు.భారత అత్యున్నత న్యాయస్థానం ప్రకారం మైన ర్ బాలికలకు వివాహాలు చేయటం చట్ట విరుద్ధమని అన్నారు. బాల బాలికలు మేజర్లు అయ్యేవరకు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించి చదివించాలని ప్రయోజకులగా తీర్చిదిద్దాల్సిన అవసరం తల్లిదండ్రులతో పాటు సమాజానికి కూడా బాధ్యత ఉందని అన్నారు. మండల న్యాయ సేవాధికారి సంఘం బాల్య వివాహాలను నిర్వహించకుండా ప్రజలను చైతన్యవంతం చేస్తామని తెలిపారు. ఈ చట్టం పైన అందరూ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలేటి శ్రీధర్ నాయుడు,ఐ.సి.డి.ఎస్ ఆఫీసర్ సిడిపిఓ కె. ఉషారాణి, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ బెజవాడ కృష్ణయ్య న్యాయవాదులు టి తిరుమలరావు, ఎస్. పవన్ కుమార్, షేక్ సంసుద్దీన్, ఏవి సుబ్బారావు, షేక్ జమీర్, పరిటాల బ్రహ్మయ్య, మహిళా న్యాయవాదులు పి.పణి కుమారి, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *