google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడం, ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా ఈ-చలాన్ (E-Challan) ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ, ప్రజల్లో బాధ్యతాయుత డ్రైవింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు.ఈ ప్రత్యేక తనిఖీల్లో హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, సీటుబెల్ట్ ధరించకపోవడం, అతివేగం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘించడం వంటి నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి ఈ-చలాన్లు విధిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.“మీ ప్రయాణం సురక్షితం కావాలంటే ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి” అని పోలీసులు సూచిస్తూ, ప్రతి వాహనదారుడు తన ప్రాణాలతో పాటు ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. రోడ్డు భద్రత కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *