తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
రీవాల్యూషన్ రిజల్ట్ లో అత్యుత్తమ మార్కులను సాధించి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల పొదిలి విద్యార్థినీలు శనివారం ప్రకటించిన రీవాల్యూషన్ ఫలితాలలో గతంలో 462 మార్కులు సాధించిన షేక్ అఫియా మరో రెండు మార్కులు రీవాల్యుషన్లో పొంది ఏకంగా ఎంపీసీ గ్రూప్ లో 464/470 మార్కులను సాధించారు. ఇప్పటికే షేక్ ఖైరున్నిసా 464 /470 కి సాధించగా ఇప్పుడు ఈ సంఖ్య ఇద్దరికీ చేరింది 464/470 మార్కులు సాధించిన విద్యార్థినిలు షేక్ అఫియా మరియు షేక్ ఖైరున్నిసా లను కళాశాల యాజమాన్యం కె.వి.రమణారెడ్డి మరియు వై వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు. సంచలన ఫలితాలను నమోదు చేస్తున్న శ్రీ వివేకానంద విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని ఈ సంవత్సరం శ్రీ వివేకానంద కళాశాల ఎంచుకొని మంచి మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకోవాలని, అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని వారు తెలియజేశారు.