తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడం, గిరిజన ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు పెద్దారవీడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగళ్లపాడు చెంచుగూడెంలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, ప్రాంతాలపై విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసు బృందం ఈ ప్రత్యేక ఆపరేషన్లో 7 విల్లు, 30 బాణాలు, 6 బైక్లను స్వాధీనం చేసుకుంది.ఈ సందర్భంగా త్రిపురాంతకం సీఐ గారు గిరిజన ప్రాంత ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమై సామాజిక దురాచారాల నివారణ, కుటుంబ సంక్షేమం, గిరిజన సమస్యలు, చట్టపరమైన అవగాహన, రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. యువత చెడు అలవాట్లు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు.ప్రజల సహకారం లేకుండా నేరాల నియంత్రణ సాధ్యం కాదని, తమ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, సామాజిక సమస్యలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల భద్రత కోసం మార్కాపురం జిల్లా పోలీసులు ఇలాంటి ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం ఎస్సై, సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.